ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుకే మా మద్దతు: గద్దర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, ఫిబ్రవరి 18: సేవ్ డెమోక్రసి అంటున్న ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తమ మద్దతు ఉంటుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం కుప్పం పున్నమిస్టార్స్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి చెబుతున్నట్లు సేవ్ డెమోక్రసి తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. సేవ్ డెమోక్రసి కోసం వీరు ఎంతవరకు పోరాడుతారో అక్కడి నుండి తాము పోరాడుతామని ఆయన అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో రహదారులు అభివృద్ధి జరిగినంత మాత్రాన సరిపోదని కిందిస్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు కిందిస్థాయిలో ప్రజలలో ఎలాంటి మార్పు లేదని, అందుకోసం ఎవరూ పాటుపడిన దాఖలాలు వేవని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ఓట్ల విప్లవం తీసుకు రావడానికి తాను కుప్పంలో జరిగే విసికే రాష్ట్ర మహాసభకు వచ్చామన్నారు.