ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: రాబోయే ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచబోమని, వీలైతే ఇంకా తగ్గిస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెచ్చిన విద్యుత్ సంస్కరణల కారణంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో దేశంలోనే ఏపీ నెంబర్-1గా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కోసం ఏటా 8వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తోందన్నారు. విద్యుత్ లోటును అధిగమించి మిగులు విద్యుత్ స్థాయికి చేరామని, వ్యవసాయ రంగానికి 9గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈమేరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 7వేల కోట్ల రూపాయలు చెల్లిస్తోందన్నారు. 40వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న అక్వా రంగాన్ని మరింతగా ఆదుకునేందుకు యూనిట్‌ను 2రూపాయలకే సరఫరా చేస్తున్నామన్నారు. ఈమేరకు 406 కోట్ల రూపాయలను డిస్కంలకు చెల్లిస్తున్నామన్నారు. విద్యుత్‌తో నడిచే వాహనాలకు యూనిట్ విలువ 5.95 రూపాయలు వసూలు చేస్తున్నామన్నారు. కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకంగా రూపాయి మేర రాయితీ ఇస్తున్నామన్నారు. ఎంబీసీలో ఉన్న 37 కులాలకు, స్వర్ణకారులకు 100 యూనిట్ల మేర ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలోనే విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించిన రాష్ట్రం ఏపీయే అని ఆయన తెలిపారు. ప్రస్తుతం సంవత్సరానికి 19,680 మెగావాట్ల మిగులు విద్యుత్ రాష్ట్రంలో ఉందన్నారు. విద్యుత్ ఉత్పతితో పాటు వినియోగంలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ సరఫరాలో నష్టాలను తగ్గించామన్నారు. నగరాల్లో 6.23 లక్షలు, గ్రామాల్లో 20లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను అమర్చామన్నారు. ఉత్తమ సేవలకు గాను ఇంధన శాఖ 137 అవార్డులను అందుకుందని మంత్రి కళా వెంకట్రావు గుర్తుచేశారు.
చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి కళా వెంకట్రావు