ఆంధ్రప్రదేశ్‌

రూ.177.10 కోట్లతో రేణిగుంట విమానాశ్రయ రన్‌వే విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 18: చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయాన్ని 177.10 కోట్లతో విస్తరిస్తామని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శివరాజు వెల్లడించారు. సోమవారం ఆయన తిరుపతిలో విలేఖరులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులకు బుధవారం ఉపరాష్టప్రతి శంకుస్థాపన చేస్తారన్నారు. ప్రస్తుతం 2286 మీటర్ల రన్‌వేను 3810 మీటర్ల వరకు విస్తరణ చేస్తామన్నారు. దీనివల్ల అంతర్జాతీయ విమానాలు కూడా రేణిగుంటలో దిగే అవకాశం ఉందన్నారు. తిరుపతి విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ను, కార్గొ కాంప్లెక్స్‌తో పాటుగా ఇతర భద్రతా పరమైన చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించారు.