ఆంధ్రప్రదేశ్‌

కవర్డ్ కండక్టర్ల కొనుగోలులో అవకతవకల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల చరిత్రలోనే తొలిసారిగా బయటపడిన కవర్డ్ కండక్టర్ల కొనుగోలు వ్యవహారంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ఇది జరిగింది పూర్తిగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలోనే. అదీ నిబంధనల ప్రకారమే టెండర్లు ఖరారు చేయడం, దేశంలో పలు రాష్ట్రాల మాదిరి ఎస్‌పీడీసీఎల్ యాజమాన్యం తక్కువ కోడ్ చేసిన వారికే కొనుగోలు చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఎస్‌పీడీసీఎల్ సీఎండీగా ఉన్న హెచ్‌వై దొర హయాంలో కొనే్నళ్ళ కిందట జరిగిన ఈ సంఘటనపై ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు జరిపిన దర్యాప్తులో కొన్ని అభియోగాలు మోపడం, దీనిలో లోపాలున్నట్టుగా గుర్తించడం, తదుపరి హైకోర్టులో కేసు నడుస్తున్న పరిస్థితులు సీఎండీ రాజీనామాకు దారితీసాయి. రెండు దశాబ్దాల కాలంగా నడుస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీల చరిత్రలోనే ఈ విధమైన అభియోగాలు రావడం ఇదే తొలిసారని సంస్థ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనపై అభియోగాలు ఎదుర్కొంటున్న, సోమవారం తన పదవికి రాజీనామా చేసిన ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర స్పందిస్తూ కండక్టర్ల కొనుగోలు వ్యవహారం పూర్తిగా పారదర్శకతతో జరిగిందని మంగళవారం కలిసిన విలేఖరులకు ఆయన వివరణిచ్చారు. దీనిపై పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపానన్నారు. అయినా హైకోర్టులో దీనికి సంబంధించిన కేసు నడుస్తోందన్నారు. దేశంలో కేరళ, కర్ణాటక, తెలంగాణా తదితర అనేక రాష్ట్రాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో మాదిరిగానే ఏపీఈపీడీసీఎల్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ కోడ్ చేసిన కార్పొరేట్ సంస్థలకే కండక్టర్ల కొనుగోలు బాధ్యతలను అప్పగించినట్టు ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఇందులో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేదన్నారు. అయితే ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారుల అవగాహనాలోపంతో తానిచ్చిన లెక్కలకు, వారి వద్దనున్న లెక్కల్లో తేడా వచ్చిందన్నారు. దీనివల్ల తనపై అభియోగాలు వస్తున్నాయన్నారు. ఈ సంఘటనతో మనస్తాపానికి గురైనందునే తాను సీఎండీ పదవికి స్వచ్చంధంగా రాజీనామా చేయడం, దీనిని ప్రభుత్వం ఆమోదించడం జరిగాయన్నారు.