ఆంధ్రప్రదేశ్‌

నాగార్జున రాజకీయాల్లోకి వస్తారని అనుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: సినీ నటుడు అక్కినేని నాగార్జున రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తరువాత ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నాగార్జున తనకు మంచి స్నేహితుడని, జగన్‌ను కలిసినంత మాత్రాన రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాదన్నారు. ఒకవేళ గుంటూరులో ఆయన పోటీ చేస్తే, తనతో కచ్చితంగా సంప్రదిస్తారన్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర గంటల వ్యవధిలోనే మారిపోయారని వ్యాఖ్యానించారు. తనతో మంచి స్నేహితుడిగా మెలిగేవారని, ఎందుకు తనపై విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్లమెంట్ ఒక కళాశాల లాంటిదని, నిత్యం నేర్చుకుంటూ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. రవీంద్ర అంటే తనకు ఇప్పటికీ గౌరవమని, గెలిచే వారికే టీడీపీ టిక్కెట్లు ఇస్తున్నారన్నారు. అలా గెలవలేమని అనుకున్న వారు పార్టీలు మారుతున్నారని ఆరోపించారు.