ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు జూన్ 30వరకు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. బుధవారం అమరావతి సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు గత డిసెంబర్ 31తో ముగియగా మరో ఆరు మాసాల పాటు ఈ గడువును పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వెంటనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు జిల్లా నుండి, సంబంధిత శాఖాధిపతుల నుండి అందిన నెల రోజుల్లోగా వాటిని క్లియర్ చేయాలని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ తదితర అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించి కొత్తగా చేర్చిన శాఖల, విభాగాలకు చెందిన ఉద్యోగుల డేటాను మార్చి 15వ తేదీలోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తగా ఈ పథకంలో చేర్చినవారిలో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా పరిషత్, గురుకులాలు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నాన్ టీచింగ్ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, గ్రంథాలయాలు, పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారని, వారి వివరాలను మార్చి 15లోగా అందివ్వాలని ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్యకార్డులపై వైద్య సేవలు పొందే విషయంలో ఎదురవుతున్న వివిధ సమస్యలను చర్చించి సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా ముఖ్య కార్యదర్శి, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ, ఉద్యోగ సంఘాల నేతలతో కూడిన ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎస్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై అందించిన వైద్య సేవలకు సకాలంలో బిల్లులు రావడం లేదని వివిధ నెట్‌వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయని, సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఉందని సీఎస్ దృష్టికి తెచ్చారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డులకు కూడా ఆరోగ్య కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదించారని, ఆ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయన్నారు.