ఆంధ్రప్రదేశ్‌

7 లక్షల కుటుంబ వివరాలు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: ప్రజా సాధికారిక సర్వేలో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకులకు ఎప్పటికప్పుడు తెలిపేందుకై విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్టస్థ్రాయిలో కమాండ్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. ఇక్కడ సిబ్బంది రెండు షిఫ్టులలో పనిచేయటంతోపాటు 24 గంటలు కంట్రోల్ రూం ద్వారా సేవలు అందిస్తారని, ఎన్యూమరేటర్లకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా సమకూర్చామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. శనివారం కంట్రోల్ రూంను సందర్శించిన కలెక్టర్ బాబు.ఎ మీడియాతో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నానికి రాష్ట్ర వ్యాప్తంగా 7లక్షల కుటుంబాలకు చెందిన 19లక్షల 31వేల మంది కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24వేల 788 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారని అన్నారు.