ఆంధ్రప్రదేశ్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 45 వేలకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్‌ను 35 వేల రూపాయల నుంచి 45 వేల రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల దాదాపు 3 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వంపై అదనంగా 300 కోట్ల రూపాయల మేరకు భారం పడనుంది. చాలా కాలంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు డిమాండ్ చేస్తున్నాయి. దాదాపు 8 సంవత్సరాలుగా పెంచలేదని చెబుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఏ మేరకు పెంచాలన్న అంశంపై సిఫారసు చేసేందుకు ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ 65 వేల రూపాయలను చెల్లించాలని సిఫారసు చేసింది. దీనికి రాష్టమ్రంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆమోద ముద్ర వేసి సీఎంకు పంపగా ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని 45 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.