ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుకు దేశభక్తి అంటే తెలియదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: దేశభక్తి అంటే చంద్రబాబుకు అర్ధం కూడా తెలియదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఏపీ బీజేపీ ఎలక్షన్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబునాయుడుకు ఏనాడూ దేశభక్తి గురించి గానీ, దేశభక్తిని ఆకాంక్షించే కార్యక్రమాల్లో పాల్గొనడం గానీ అతనికి తెలియదని విమర్శించారు. పుల్వామా ఘటన నేపథ్యంలో అమర జవాన్లకు నివాళి అర్పిస్తూ చిన్న పిల్లలు, అతి సామాన్యులు సైతం దేశభక్తిని ప్రదర్శిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, చంద్రబాబునాయుడు ఈ ఘటనను రాజకీయంగా మాట్లాడటం ఆయన మనస్తత్వానికి అద్దం పడుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు బాసటగా నిలుస్తుంటే చంద్రబాబునాయుడు మాత్రం పుల్వామా ఘటనను రాజకీయంచేస్తూ ప్రధాని మోదీపై అక్కసును వెళ్ళగక్కుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది దేశభక్తి ప్రేరేపిత తరుణమని కూడా మర్చిపోయి చంద్రబాబునాయుడు వ్యవహరించడం దారుణమన్నారు. అసలు దేశభక్తి అంటే చంద్రబాబునాయుడుకు, ఆయన కొడుక్కి కూడా తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి ప్రధాని నెహ్రూ విధానంవల్లే కాశ్మీర్ సమస్య నేటికీ రావణకాష్టంగా మారిందన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబునాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు.చంద్రబాబునాయుడు మానసికంగా రక రకాల ఆందోళనలకు గురవుతూ ఇటీవల జరిగిన విద్రోహ దాడిని తెలియజేయడంలో మోదీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇటువంటి కార్యక్రమాలు ఉద్భవించాయని అనడం ఆయన ఆలోచనా ధోరణిని తెలియజేస్తోందని సోము అన్నారు. ఈ ఘటనను బాబు ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించడం జాతి క్షమించదన్నారు. గుజరాత్ గోద్రా సంఘటనను గుర్తుచేసుకుంటున్న చంద్రబాబునాయుడు మోదీ కాళ్ళు పట్టుకుని ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. పుల్వామా అమానుష ఘటనపై రాజకీయాలకు తావులేదని, ఇది ఎన్నికలకు ముడిపెట్టే అంశంకాదన్నారు. సాధ్యమైతే పరిష్కారానికి ఆలోచనచేయాలి గానీ, రాజకీయం చేయడం చంద్రబాబుకు సబబుకాదన్నారు. ప్రతీ సామాన్యుడు ఈ ఘటనను ఖండిస్తూ దేశభక్తిని ప్రదర్శిస్తుంటే చంద్రబాబునాయుడు మాత్రం రాజకీయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు ఎపుడైనా వందేమాతరం గానీ, భారత్ మాతాకీ జై అని గానీ అన్నారా, ఎపుడైనా దేశభక్తి ఉద్యమాల్లో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. దేశభక్తి ప్రదర్శించడానికి చంద్రబాబు అనర్హుడన్నారు. దేశభక్తి పరాయణత కలిగిన బీజేపీ త్యాగాలు అనుసరణనీయమని, బీజేపీ దేశభక్తి కలిగిన ఏకైక పార్టీ అన్నారు. చంద్రబాబునాయుడు భావజాలాన్ని తెలియజేస్తూ అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నామన్నారు.
నేడు అమిత్ షా రాజమహేంద్రవరం పర్యటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గురువారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారని జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. ఉదయం ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకునే అమిత్‌షా ముందుగా స్థానిక 47వ డివిజన్‌లో సంపర్క అభియాన్ యోజన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కేంద్రంలో మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించే విషయాన్ని తెలియజేయడానికి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత శక్తి కేంద్రాల సభలో ప్రసంగించి దిశానిర్దేశం చేస్తారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.

చిత్రం.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.