ఆంధ్రప్రదేశ్‌

ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్‌కు గ్లోబల్ క్లీన్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 20: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని విశేషంగా అమలుచేసిన ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్‌కు ఇంధన, పర్యావరణ ఫౌండేషన్ నుంచి ‘గ్లోబల్ క్లీన్ అవార్డు- 2019’ లభించింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పర్యావరణ ఫౌండేషన్ ‘గ్లోబల్ సేఫ్టీ అవార్డు-2019’ పురస్కారాన్ని అందుకుంది. ఈ రెండు అవార్డులు న్యూఢిల్లీలో ఓఎన్జీసీ రాజమహేంద్రవరం న్యూయార్క్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ ద్వారా బుధవారం అందజేసినట్టు ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ తెలియజేశారు. అవార్డులు అందించిన ఫౌండేషన్ పేద ప్రజలకు విద్యుత్, ఇతర ప్రాథమిక ఇందన వనరులను అందించే లాభాపేక్షలేని సంస్థ అన్నారు. పర్యావరణ పరిరక్షణలోనూ, పర్యావరణాన్ని కాపాడటానికి అపెక్స్ ఇండియా ఫౌండేషన్ నుంచి అపెక్స్ ఇండియా ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌లెన్సీ అవార్డు 2018 కింద ప్లాటినం అవార్డు కూడా రాజమహేంద్రవరం ఓఎన్జీసీ అసెట్‌కు లభించిందని తెలిపారు. ఈ అవార్డు కూడా బుధవారం న్యూఢిల్లీలో సమర్పించారని, ఈ సంస్థ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే ఒక ఎన్జీవో సంస్థని ఈడీ డిఎం ఆర్ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ అవార్డులు సాధించిన రాజమహేంద్రవరం అసెట్ ఈడీ అసెట్ మేనేజర్ డిఎం ఆర్ శేఖర్‌ను ఓఎన్జీసీ డైరెక్టర్ ఎన్ పాండే అభినందించారు.

చిత్రం.. అవార్డులతో ఓఎన్జీసీ డైరెక్టర్ పాండే, రాజమహేంద్రవరం ఈడీ, అసెట్ మేనేజర్ శేఖర్