ఆంధ్రప్రదేశ్‌

ఉజ్వలంగా తెలుగువారి భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: తెలుగువారి గతం, వర్తమానమే కాకుండా భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఉండవల్లి ప్రజావేదికలో గురువారం మాతృభాషాదినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి భాష ఎంతో కీలకమైనదని, ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, జీవన శైలిని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణంతో జాతి ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుందన్నారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటూ గుంటూరు సీమ బేతపూడి బిడ్డ వేములపల్లి శ్రీకృష్ణ పిలుపునిస్తే, దానిని జాతి నినాదంగా ఎన్టీఆర్ మార్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణకు 7 అకాడమీలను ఏర్పాటు చేశామని వివరించారు. మాతృభాషాభివృద్ధికి తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశామని, తెలుగు భాషను పరిపాలనా భాషగా, బోధనా భాషగా సమర్థంగా అమలు చేసేందుకు ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాచీన భాషా కేంద్రాన్ని నాగార్జున వర్సిటీలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలుగు సాహిత్య సంపదను సుసంపన్నం చేసేందుకు రచయితలు, కవులకు అవసరమైన సహాయం చేస్తామని, భాషను వారసత్వ సంపదగా భావితరాలకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, ఆదినారాయణరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎంపీలు సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర, టీజీ వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు.