ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాజలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 23: కృష్ణాజలాల పంపిణీలో రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఏపి జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎగువన పుష్కలంగా వర్షాలుకురిసి వరద నీరు ఉన్నప్పటికీ దిగువకు నీటి విడుదల విషయంలో కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. శనివారం జలవనరులశాఖ చీఫ్ ఇంజనీరు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కాలువల ద్వారా నీటిని తరలించి హైడల్ జనరేషన్‌ను ఇష్టారాజ్యంగా చేపట్టటం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు నీరు అందడం లేదన్నారు. నారాయణపూర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు అవుట్ ఫ్లోగా 32వేల క్యూసెక్కుల నీరు విడుదలయిందని తెలిపారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం పసలేని వాదనలు వినిపించినందునే ఈ దుర్గతి పట్టిందన్నారు. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు చేపట్టిన వైఎస్ సీమను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణా డెల్టాతో పాటు సీమకు నీరందించే ప్రయత్నాలు చేస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా 4925 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చామని ఈ నీటితో కృష్ణాడెల్టా అవసరాలు తీరగలవన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామని, వచ్చే ఏడాది మే నెలకు ఎడమ కాలువ పనులు కూడా పూర్తిచేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు నీరు తరలిస్తామన్నారు.