ఆంధ్రప్రదేశ్‌

సవాలుగా మారిన విద్యుత్ నిల్వ సామర్థ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 21: దేశంలో పారిశ్రామిక, ప్రజా అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో వివిధ మర్గాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నిల్వ చేయడం అంతే ముఖ్యమని గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఎమ్. శ్రీ్భరత్ అన్నారు. దేశ విద్యుత్ రంగం ‘అవసరాలు-సవాళ్ళు’ అనే అంశంపై గురువారం గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యప్రసంగం చేశారు. విద్యుత్ నిల్వ సామర్థ్యం అనేది దేశం ఎదుర్కొంటున్న పెనుసవాలుగా పేర్కొన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 60 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అయితే పారిస్ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణహిత విద్యుత్ ఉత్పాదన జరగాలంటే ప్రత్యామ్నాయ మార్గాలైన సౌర, పవన, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన వైపు మళ్ళాల్సి ఉందన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పాదన వౌలిక సదుపాయాలపై ఖర్చు చేసే ఆర్థిక స్థితిలో భారతదేశం లేదన్నారు. ప్రైవేటు రంగంలో సౌర, పవన, బయోమాస్ పరిశ్రమల ద్వారా విద్యుత్ ఉత్పాదనకు కంపెనీలు ముందుకు వచ్చినా సరైన నిల్వసామర్థ్యం లేక విద్యుత్‌ను ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేయడానికి అవరోధాలు ఎదురవుతున్నాయన్నారు. విద్యుత్ వినియోగం ఒకే విధంగా లేకపోవడం వల్ల డిమాండ్ పెరిగిన సమయంలో నిల్వచేసిన విద్యుత్‌ను వాడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై యువ ఇంజనీర్లు దృష్టి నిలిపి విద్యుత్ స్టోరేజి పరిజ్ఞానంపై పరిశోధన జరపాలన్నారు. ఎన్‌టీపీసీ జనరల్ మేనేజర్ ఏసీ సాహు మాట్లాడుతూ పర్యావరణ చట్టాల ఆధారంగా విద్యుత్ ఉత్పాదన చేయాలంటే విద్యుత్ కేంద్రాల ఆధునీకరణకు రానున్న రోజుల్లో భారతదేశం రెండు లక్షల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి ఉందన్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై భవిష్యత్‌లో పెనుభారం పడక తప్పదన్నారు. దేశంలో ప్రైవేటు ఉత్పాదన విజయవంతం కాకపోవడం వలన 30వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు మూతపడ్డాయన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను క్రమ పద్ధతి లేకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కలపడం వల్ల గ్రిడ్‌పై పడుతోందన్నారు. విద్యుత్ ఉత్పాదన కేంద్రాల జీవితకాలం దెబ్బతినడానికి ఇది ఒక కారణంగా పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో ‘నేత్ర’ పెన్‌పీప్ పేరిట పరిశోధనా కేంద్రాలను నెలకొల్పినట్టు ఎన్‌టీపీసీ జనరల్ మేనేజర్ తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే భూగర్భ కేబుల్ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి వస్తుందని ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బి.రమేష్‌ప్రసాద్ వెల్లడించారు. 33కేవీ, 11కేవీ, ఎల్‌టీ కేబుళ్ళను భూగర్భంలో నిర్ధేశిత ప్రాంతంలో అమర్చుతామన్నారు. హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎదురయ్యే విద్యుత్ ప్రసార సమస్యలను దృష్టిలోపెట్టుకుని ఆకర్షణీయ నగరంగా ఎంపికైన విశాఖలో రూ.780 కోట్ల వ్యయంతూ భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, అవుటర్ హర్బర్, సాగర్‌నగర్ వంటి తీర ప్రాంతాల్లో జూలై మాసాంతానికి భూగర్భ కేబుళ్ళ అమరిక పూర్తిచేయాలన్నది తమ లక్ష్యమన్నారు. వీధి దీపాల్లో లెడ్ దీపాల వాడకం, గృహఅవసరాలకు లెడ్ దీపాలను పంపిణీ చేయడం ద్వారా నగరంలో దాదాపు 35 శాతం వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించగలిగామన్నారు. సదస్సుకు గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్ అధ్యక్షత వహించగా 3పీ ఫౌండేషన్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సూర్య జీడిగుంట, గీతం రిజిస్ట్రార్ కెవిజిడి బాలాజీ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎస్.నారాయణరావు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ఏ.రాములు ప్రసంగించారు.
చిత్రం.. సదస్సులో మాట్లాడుతున్న గీతం అధ్యక్షుడు శ్రీ్భరత్