ఆంధ్రప్రదేశ్‌

కోట్ల పార్టీ విడితే నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఫిబ్రవరి 21: కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్‌కు జరిగే నష్టం ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అలాంటి వంద మందిని తయారుచేసే సత్తా కాంగ్రెస్‌కు ఉందన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను తయారుచేసే కర్మాగారం లాంటిదన్నారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినవారేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని, ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కేంద్రంలో మోదీ ఆగడాలను అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో మరో 25 ప్రాంతీయ పార్టీలు జత కట్టాయన్నారు. ఈ కూటమిని చూసి మోదీకి వణుకు మొదలైందన్నారు. మోదీ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే దేశంలో, రాష్ట్రంలో వికేంద్రీకరణ దిశగా పాలన సాగుతుందన్నారు. దీంతో అన్ని ప్రాంతాలు సమాంతర అభివృద్ధి సాధిస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉభయ రాష్ట్రాల పరిధిలో కేంద్రీకృత పాలన కారణంగా మెగాసిటీని అభివృద్ధి చేశారని దీంతో మిగతా ప్రాంతాలు వెనుకబడ్డాయన్నారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని, ఫలితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడ్డాయన్నారు. కేంద్రీకృత పాలనతో అభివృద్ధి సాధ్యం కాదని, వికేంద్రీకరణతోనే అభివృద్ధి ఫలాలు అందరికీ పంచవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు మెజార్జీ ఇస్తే తొలి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చేస్తామన్నారు. హోదా భరోసా బస్సుయాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకుంటుందని, అక్కడ జరిగే బహిరంగసభలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తారన్నారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి క్రిష్ట్ఫర్, నాయకులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.