ఆంధ్రప్రదేశ్‌

ఓటర్ల నమోదు, సవరణలకు ప్రత్యేక శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్‌లలోనూ జాబితాలో పేరు నమోదు, సవరణలకై ప్రత్యేక ప్రచార, నమోదు కార్యక్రమం (స్పెషల్ క్యాంపైన్) నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలతో స్పెషల్ క్యాంపైన్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 23, 24 తేదీల్లో స్పెషల్ క్యాంపైన్ నిర్వహించి ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలన్నారు. అదే సమయంలో 18 సంవత్సరాలు నిండిన యువత కొత్తగా ఓటర్లుగా నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు వంటి సవరణలు కోసం అవసరమైన ఫారం 6, 7, 8, 8ఏ దరఖాస్తులను అందుబాటులో ఉంచాలన్నారు. దీనిపై మీడియా సమావేశాలు, కరపత్రాలు, వాల్ పోస్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రోలింగ్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఓటర్లుగా నమోదు చేయించుకున్నవారు ఓటర్ల జాబితాలో పేర్లను, పూర్తి వివరాలను సరిచూసుకుని మార్పులు, చేర్పులకు అవసరమైన దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచి వాటిని పూర్తి చేయడంలో ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలు సహకరించాలన్నారు. రెండు రోజులపాటు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ఉదయం 9 గంటల నుండి తాజా ఓటర్ల జాబితాతో హాజరుకావాలని, ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా ప్రత్యేక క్యాంపులపై సమాచారాన్ని అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో నమోదు, మార్పులు, చేర్పులకు సమర్పించిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రత్యేక క్యాంపుల్లో అందిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇఆర్‌ఓలు, ఎఇఆర్‌ఓలను ఆదేశించారు. తొలుత జిల్లా కలెక్టర్, మాజీ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వినోద్ జుస్సికి స్వాగతం పలికారు. వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుజాతా శర్మ, మాజీ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వినోద్ జుస్సి, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఓటర్ల నమోదుకు సహకరించండి
ఓటర్ల నమోదుకు సహకరించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కోరారు. వెలగపూడి సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఆయన వివిధ రాజకీయ పార్టీలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు కేంద్రాల వద్ద తమ ప్రతినిధులను నియమించి సహకరించాలన్నారు. రాజకీయ పార్టీల సందేహాల నివృత్తికి ఎన్నికల కమిషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
దీనిపై వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు కొన్ని సమస్యలను ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. పట్టణాల్లో డోర్ నెంబర్ సరిచేసి ఓటరు నమోదుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి దరఖాస్తులు తీసుకువస్తే వాటిని తీసుకునేలా చూడాలన్నారు. బూత్ లెవెల్ అధికారుల పనితీరు సరిగా లేదని, ఓటరు స్లిప్పులను ప్రభుత్వమే పంచాలని, ఓటర్ల జాబితాలో మొదట చూపిన లెక్కకు, ఆన్‌లైన్‌లో చూపిన లెక్క మధ్య 20 లక్షల ఓట్ల తేడా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో వైకాపా నేతలు మల్లాది విష్ణు, వి.శ్రీనివాసరావు, సీపీఎం నేత వై.వెంకటేశ్వర రావు, సీపీఐ నేత జెల్లి విల్సన్, బీజేపీ నేత రంగబాబు తదితరులు పాల్గొన్నారు.