ఆంధ్రప్రదేశ్‌

బకాయిల వసూలుకు జివిఎంసి గాంధీ గిరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: పన్ను బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఆస్తిపన్ను చెల్లించాలంటూ ఎన్ని నోటీసులిచ్చినా స్పందన కానరావట్లేదు. దీంతో మొండి బకాయిల వసూలు ఒక్కటే మార్గమని మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) అధికారులు తలపోశారు. దీంతో గాంధీగిరీని అశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖలో మంగళవారం చోటుచేసుకున్న సంఘటన పన్నుల వసూళ్లలో స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకు కట్టింది. జివిఎంసి జోన్ 3 పరిధిలో క్రిస్టియన్ మిషనరీ సంస్థ అసుపత్రులు, విద్యాసంస్థలు, ఇతర సామాజిక సేవా సంస్థలను నిర్వహిస్తోంది. నగర పరిధిలోని ఈ సంస్థలకు చెందిన ఆస్తి పన్ను చెల్లించే విషయంలో రెండు దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఆస్తిపన్ను చెల్లించే అంశంపై మిషనరీ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో 1995 నుంచి జివిఎంసికి ఆస్తిపన్ను చెల్లించలేదు. 20 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో రూ.4.66 కోట్ల మేర జివిఎంసికి సంస్థ బకాయి పడింది. అపరాధ రుసుం, ఇతర ఛార్జీలతో కలిపి ఈ మొత్తం రూ.10 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు జివిఎంసి రెవెన్యూ విభాగం అధికారులు మంగళవారం మిషనరీ సంస్థ నిర్వహిస్తున్న అమెరికన్ ఆసుపత్రికి వెళ్లారు. జివిఎంసి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పన్ను బకాయిలు చెల్లించాలని డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) రవీంద్ర, జోనల్ కమిషనర్ బాపిరాజు తదితరులు ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. ఆస్తిపన్ను చెల్లింపుపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు చెల్లించలేమని యాజమాన్యం తేల్చి చెప్పింది. న్యాయస్థానంలో వ్యాజ్యం నడుస్తున్నప్పటికీ నిబంధనల మేరకు 50 శాతం మొత్తాన్ని చెల్లించాలంటూ అధికారులు పట్టుబట్టారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో రూ. 50 లక్షల వరకూ బకాయిలు చెల్లించామని, ఇప్పటికిప్పుడు పూర్తి మొత్తం తాము చెల్లించలేమని, న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చెల్లింపులు జరుపుతామని యాజమాన్యం పేర్కొంది.