ఆంధ్రప్రదేశ్‌

వేసవిలో నీటి ఎద్దడి రానీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి సమస్య ఎదురుకాకుండా అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠా అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో వివిధ కేంద్ర పథకాలకు నిధుల విడుదల, ఈ-ప్రగతి, ఆర్టీజీఎస్, మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ, తదితర అంశాలను శుక్రవారం ఆయన సమీక్షించారు. ముందుగా వేసవిలో మంచినీటి సమస్యపై సమీక్షిస్తూ ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. పశువులకూ మంచినీటి సమస్య రాకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక కింద 50కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేశామన్నారు. ఈ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్‌ను ఆదేశించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ వరప్రసాద్ మాట్లాడుతూ మరో 90 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వివిధ వ్యాధులు ప్రబలకుండా నివారణకు ముందుగానే తగిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రజల జీవన విధానం మరింత మెరుగపడేందుకు వీలుగా పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలన్నారు. రాష్టస్థ్రాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ పొదుపు పాటించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కేంద్రం నుంచి వివిధ ప్రాయోజిత పథకాల కింద నిధులు సకాలంలో విడుదలకు అవసరమైన వినియోగ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ అంశంపై ఢిల్లీ నుంచి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ ఇప్పటివరకూ కేంద్రం వివిధ పథకాల కింద విడుదల చేసిన నిధుల వివరాలు తెలిపారు. ఆకర్షణీయ నగరాలకు సంబంధించి విశాఖకు మూడో విడత, తిరుపతికి రెండో విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అమృత్ పథకం కింద 167కోట్ల రూపాయలు విడుదల కానున్నాయన్నారు. వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలు, ప్రతిపాదనల వివరాలను తమకు పంపాలని కోరారు. కొన్ని శాఖల్లో వివిధ ఉద్యోగుల సీనియారిటీ నిర్థారణ, పదోన్నతి అంశాల్లో ఏళ్ల తరబడి జాప్యం సరికాదని, సకాలంలో జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇప్పటివరకూ మంత్రివర్గ సమావేశాల్లో 2500 తీర్మానాలు చేయగా, వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక
ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణపై సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పుణేఠా ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల అమలు తీరుపై శుక్రవారం ఆయన వెలగపూడి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అన్నిరకాల వ్యర్థాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలియచేయాల్సి ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలన్నీ తమ పరిధిలోని ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, ప్రతిపాదిత చర్యలకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సమీక్షించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత్ రామ్ ఘన వ్యర్థాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు. కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖలో వాయు కాలుష్యం నివారణకు, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, నాగావళి, కుందు నదులను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.