ఆంధ్రప్రదేశ్‌

అది రాజకీయ కుట్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో టీడీపీ పది నెలలుగా అబద్ధాల రాజకీయం సాగిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. నగరంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుని హోదాపై యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఆయన కుట్రలు పార్టీని దిగజార్చాయని, టీడీపీ అధికారాన్ని కోల్పోవడమేకాదు, ఏపీలో కనుమరుగవుతుందని శపించారు. కేంద్రం ఇచ్చిన పథకాలకు స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటూ ‘స్టిక్కర్ బాబు’గా చంద్రబాబు మారిపోయారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 5.50 లక్షల కోట్లు ఇస్తే వాటికి ముఖ్యమంత్రి లెక్కలు చెప్పడం లేదన్నారు. సబ్ కా వికాస్ విధానమే తమ నినాదమని, అన్ని వర్గాల వారికి మేలుచేసేలా ప్రధాని మోదీ పాలన సాగుతోందన్నారు. అమిత్ షా, మోదీ పర్యటనలతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే పీఎం ఆషా పథకం కింద రాష్ట్రంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయన్నారు. ప్రతిపక్ష నేత విదేశాలకు వెళితే డబ్బులు తెచ్చేందుకేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని, ఈ లెక్కన చంద్రబాబు బృందం ముందుగానే డబ్బులు సిద్ధం చేసుకున్నారా? అని విమర్శించారు. సింగపూర్, దుబాయ్, అబుదాబీ దేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులేమీ రాలేదన్నారు. మరి ఆ దేశాలకు ఎందుకు వెళ్లారో చంద్రబాబు, టీడీపీ నేతలు జవాబు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యు శ్రీనివాసరాజు, ఆర్టీఐ మాజీ కమిషనర్ పీ. విజయబాబు పాల్గొన్నారు.