ఆంధ్రప్రదేశ్‌

లండన్ వేదికగా దుర్మార్గంగా కుట్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: లండన్ వేదికగా కుట్రలు జరుగుతున్నాయని, కేసీఆర్, బీజేపీ మనుషులు జగన్‌తో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని, ఇది దుర్మార్గమని, దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాయింట్ 5శాతం కూడా ఓట్లులేని బీజేపీ బహిరంగ సభలు పెట్టి భంగపాటుకు గురికావడం తప్పదని హెచ్చరించారు. శ్రీకాకుళంలో కూడా సభ పెట్టి భంగపడ్డారన్నారు. ఏపీకి మోదీ రూ. 3లక్షల కోట్లు ఇచ్చానని, అమిత్‌షా రూ. 5లక్షల కోట్లు ఇచ్చానని, మరొకరు రూ. 10లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని, దీనిలో ఏది నిజమో వాస్తవాలు చెప్పాలన్నారు. బహిరంగ సభలు పెట్టి ఏపీకి వచ్చి విషం చిమ్ముతున్నారన్నారు. నరేంద్ర మోదీ, బీజేపీ చేసిన ద్రోహానికి ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీతో కుమ్మక్కై జగన్ ఆడుతున్న జగన్నాటకానికి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. 2019లో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని పగటికలలు కంటున్నారని, 16 పార్టీలు కలిసి ఎన్డీఏను ఓడించి స్పష్టమైన తీర్పు చెప్పబోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో రాజధాని నిర్మాణం చేపడుతున్నారన్నారు.