ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర విభజన ఎంతో బాధించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: పోలీస్‌శాఖలో రాష్ట్ర విభజనకు ముందు తాను వివిధ హోదాల్లో 30 ఏళ్లు పైగా పనిచేస్తే ట్రైనీ ఎఎస్‌పిగా గుంటూరులో కొంతకాలం పనిచేయటం మినహా పూర్తిస్థాయి తెలంగాణలో పనిచేసి అన్ని స్థాయిల్లోనూ అక్కడి వారందరితో మమేకమై విధులు నిర్వర్తించిన తనను రాష్ట్ర విభజన ఎంతో బాధించిందంటూ డిజిపి జెవి రాముడు ఉద్వేగంతో అన్నారు. విధి నిర్వహణలో దేశంలో అనేక రాష్ట్రాల్లో పర్యటించాను.. ప్రతి ఒక్కరూ ఏపి పోలీస్ పనితీరును ప్రశంసిస్తుంటే తన రోమాలు నిక్కబొడుచుకునేవి.. అలాంటిది విభజన వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులుంటాయని తాను భావించేవాడినన్నారు. నాలుగైదు మాసాల్లో పదవీ విరమణ చేయాల్సి వుండగా, సొంత గూటికి వెళ్లటానికి సమాయత్తమవుతున్న తరుణంలో అందునా క్లిష్ట సమయంలో 2014 జూన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు తనను పిలిపించి డిజిపిగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారని అన్నారు. తనపై ఆయన ఉంచిన నమ్మకం, విశ్వాసాన్ని ఎన్నటికీ మరవలేనన్నారు. పదవీ విరమణ సందర్భంగా స్థానిక పోలీస్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం రాముడుకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూరాధ, డిజిలు, అడిషనల్ డిజిలు, ఐజి, డిఐజిలు, 13 జిల్లాల ఎస్‌పిలు, ఇతర ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. రెండేళ్లపాటు రాష్ట్రానికి రాముడు అందించిన సేవలను ప్రస్తుతిస్తూ ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇఎల్ నరసింహన్ అభినందన సందేశం పంపించారు. ఈ సందర్భంగా రాముడు తన ప్రసంగంలో ప్రత్యేకంగా తన కుటుంబ చరిత్రను ప్రస్తావిస్తున్నప్పుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. కడప జిల్లా పులివెందులకు సమీపంలో కుగ్రామం నరసింగపల్లిలో నిరక్షరాస్యులైన జాస్తి వెంకటయ్య, గోవిందమ్మ దంపతులకు జన్మించానన్నారు. ఏదైనా ఉత్తరం ముక్కవస్తే ఆ గ్రామంలోని ఏకైక టీచర్‌ను పిలిపించుకుని చదివించుకునేవారన్నారు. 12 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని, దీంతో తరచూ స్కూలుకు ఎగనామం పెట్టి పొలాల చుట్టూ తిరిగేవాడినన్నారు. పొరుగు గ్రామంలోని పోస్ట్ఫాసు నుంచి పోస్ట్‌లో ఓ పత్రిక వస్తుండేదని, సివిల్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూసే తరుణంలో ఐఎఎస్‌కు ఎంపికైనట్లు తెలుసుకుని ఢిల్లీకి పరుగు దీసానన్నారు. పోలీస్‌శాఖలో ఉన్నత ఉద్యోగం వచ్చిందని చుట్టుపక్కలవారు చెబితే ఎస్‌ఐ కాకుండా ఎలా వస్తుందని తన తండ్రి అమాయకంగా ప్రశ్నించారని రాముడు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. శిక్షణ కాలంలోనే తన తండ్రి మరణించారని వివరించారు. నోటిలో వేలు పెడితే కొరకలేని వాడు పోలీస్‌గా ప్రజలకు ఏమి చేయగలడనే బాధతోనే తండ్రి చనిపోయాడని ఆవేదనతో తల్లి చెప్పిన మాటలు తనలో బాధ్యతను మరింత పెంచాయన్నారు. ఆ సమయంలో రాముడు కళ్లు చెమర్చటం కన్పించింది. రాష్ట్ర విభజన వల్ల అనేక కష్టాలు వచ్చాయని, కర్నాటక డిజిపి తన బ్యాచ్‌మేట్ అని, తెలంగాణ ప్రభుత్వానికి డబ్బు అధికంగా ఉండడంతో పోలీసులకు లబ్ధి చేకూర్చే జీవోలు వస్తున్నాయని అన్నారు.

చిత్రం.. వీడ్కోలు సభలో మాట్లాడుతున్న డిజిపి రాముడు