ఆంధ్రప్రదేశ్‌

బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో అన్యాయం చేసిన కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు కాంగ్రెస్ బస్సు యాత్రను అడ్డుకున్నాయి. శనివారం స్థానిక వైసీపీ సీనియర్ నేత కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు నల్లజెండాలతో నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్రను అడ్డుకున్నారు. కాంగ్రెస్ వాహనాలు వెంకటగిరిలోకి వస్తున్నాయని తెలుసుకున్న వైసీపీ నాయకులు ఒక్కసారిగా క్రాస్‌రోడ్డు జంక్షన్ వద్దకు చేరుకుని కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విభజన సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తామంటూ బస్సు యాత్ర ద్వారా ప్రజల ముందుకు ఎలా వస్తారంటూ వైసీపీ నేత కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్‌ఐ రమ్య, సిబ్బంది క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకుని వైసీపీ నాయకులను నిరసన ఉపసంహరించుకోవాలని సూచించారు. తాము శాంతియుతంగా, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పడంతో కొంతసేపు ప్రశాంతంగా నిరసన చేపట్టారు. నాయుడుపేట మార్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, వాహనాలు రావడంతో వైసీపీ నాయకులు ఒక్కసారిగా వారి వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్డీ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య వచ్చి వైసీపీ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా గట్టిగా నినాదాలు చేశారు. ఈక్రమంలో వైసీపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట మొదలైంది. వెంటనే రెండు పార్టీల నాయకులను పక్కకునెట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రెండు పార్టీల వారు ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టడంతో పోలీసులు మళ్లీ రంగప్రవేశం చేసి వైసీపీ నాయకులను పక్కకు తొలగించారు. అనంతరం కాంగ్రెస్ పార్డీ వాహనాలు, నాయకులు పట్టణంలోకి ప్రవేశించారు.
కాంగ్రెస్ యాత్రను అడ్డుకునే హక్కు వైసీపీకి ఎవరిచ్చారు:రఘువీరా
ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు భరోసా కలిగించేందుకు బస్సుయాత్ర ద్వారా వెంకటగిరి వస్తే వైసీపీ నాయకులు నల్లజెండాలతో అడ్డుకోవడం దుర్మార్గమని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి మండిపడ్డారు. తాము అధికారంలో వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పే తమను అడ్డుకోవడంతో అర్ధమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ యాత్రను వైసీపీ నాయకులు అడ్డుకోవడం మాజీ మంత్రి ఆనం వ్యక్తిగతంగా చేశారా లేక ఇందులో పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హస్తం కూడా ఉందా అనే విషయం తేల్చి చెప్పాలన్నారు. ఆనం కాంగ్రెస్ పార్డీలో ఉన్నప్పుడు జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని సంభోదించి సిగ్గు లేకుండా జగన్ పార్టీలో చేరారని, ఆనంకు సిగ్గులేకపోతే జగన్‌కు కూడా సిగ్గులేదా అని నిలదీశారు. వెంకటగిరిలో కాంగ్రెస్ పార్టీపై జరిగిన సంఘటన చూస్తే వైసీపీ రౌడీల పార్టీ అని కచ్చితంగా చెప్పవచ్చన్నారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి కొంచెం మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఆయనను ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు.