ఆంధ్రప్రదేశ్‌

సాగుదార్లకే పంట రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: రాష్ట్రంలో సుమారు 2కోట్ల ఎకరాల భూమి సాగుకు అనువుగా వున్నందున ఈ ఏడాది వ్యవసాయ పంటల ఉత్పాదకతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పంటల బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఇతర అంశాలపై ఆయన శనివారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్, ఎరువులు, సాగునీటి విషయంలో ఎక్కడా రైతులకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక ఎంపిఇవో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనావృష్టి ప్రాంతాల్లో రెయిన్ గన్స్ వినయోగించి పంటలను కాపాడాలన్నారు. సాగుదారులకే పంట రుణాలు దక్కాలని, అలాగే కలెక్టర్లు కూడా వ్యవసాయ రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు. సాగుదారుల ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సిఎం ఆదేశించారు. వెబ్‌ల్యాండ్ సమాచారం ఆధారం సాగుదారులకు రుణాలు అందించేలా బ్యాంకులు చూడాలన్నారు. బీమా కంపెనీలు, బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని దీనికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారముంటుందని చంద్రబాబు అన్నారు. నాగార్జునసాగర్ పరీవాహక ప్రాంతంలో సాగునీటి కోసం ఎదురుచూడకుండా ఖరీఫ్ ఆలస్యం కాకుండా మెట్ట ప్రాంతాలను ప్రోత్సహించాలన్నారు. రిజర్వాయర్లలో నీటి లభ్యతను బట్టి ముందుగానే రబీ ప్రారంభించేలా చూస్తామన్నారు.