ఆంధ్రప్రదేశ్‌

కంటైనర్ థియేటర్‌లో కబాలీ చిత్రాన్ని వీక్షించిన సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, జూలై 23: ప్రత్యేక తరహాలో రూపొందించిన డ్రైవ్ ఇన్ థియేటర్ (కంటైనర్ థియేటర్)ను ఎపి సిఎం చంద్రబాబునాయుడు విశాఖలో శనివారం ప్రారంభించారు. సుమారు రూ.35 లక్షల వ్యయంతో కంటైనర్‌లో అత్యాధునిక సదుపాయాలతో థియేటర్‌ను ఎస్‌టిబిఎల్ సంస్థ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో మూతబడుతున్న సిన్మా హాళ్లను దృష్టిలో ఉంచుకుని, దీన్ని రూపొందించినట్టు సంస్థ యజమాని వీరభద్రరావు సిఎం చంద్రబాబుకు వివరించారు. పూర్తిగా సోలార్ విద్యుత్ పనిచేసే థియేటర్‌ను ఏ ప్రాంతానికి కావాలంటే ఆప్రాంతానికి తీసుకెళ్ల వచ్చన్నారు. డ్రైవ్ ఇన్ థియేటర్ పట్ల సిఎం చంద్రబాబు కూడా ఆసక్తి కనబరిచారు. థియేటర్‌ను ప్రారంభించిన చంద్రబాబు, సహచర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, ఎంపి హరిబాబులతో కలిసి 10 నిముషాల పాటు కబాలి2 చిత్రాన్ని వీక్షించారు. ఇదే ప్రాంగణంలో ఒపెన్ ఎయిర్ థియేటర్‌ను సిఎం ప్రారంభించారు. కార్లలో కూర్చునే భారీస్క్రీన్‌పై చిత్రాన్ని వీక్షించే విధంగా ,కార్లలో ఉండే స్టీరియో సిస్టంకు ఎఫ్‌ఎంను అనుసంధానం చేయడం ద్వారా స్క్రీన్‌పై చిత్రాన్ని చూసేలా ఉంది.