ఆంధ్రప్రదేశ్‌

ఆదరణ అదరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఘనంగా మర్యాదలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో ఆదివారం సమీక్ష జరిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అక్షయపాత్ర, టిటిడి దేవస్థానం భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు లక్ష మంది భక్తులకు రుచి, శుచికరమైన భోజనం అందిస్తుంది.గోదావరి పుష్కరాల్లో కొవ్వూరు, సిద్ధాంతంలో రైస్ మిల్లర్లు భక్తులకు భారీగా భోజన ఏర్పాట్లు చేసిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. భోజన ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజులూ కృష్ణా నదిలో జల క్రీడలు నిర్వహించేందుకూ ఏర్పాట్లు చేయాలన్నారు. క్రూయిజ్‌లు, ఏసి, స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో 10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న ఏప్రాన్‌పై సంపూర్ణ శాఖాహార ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన వంటకాలను భక్తులకు రుచి చూపించాలని చెప్పారు. ఫుడ్ కోర్టుల్లో మన రాష్ట్ర వంటకాలతోపాటు, ఇతర రాష్ట్రాల వంటలను కూడా ఉంచాలని ఆయన ఆదేశించారు. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణంగా సహకరించాలని విజయవాడ నగర పౌరులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో నగర పౌరులనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. గోదావరి పుష్కరాల్లో తన విజ్ఞప్తిని మన్నించి భక్తులకు గోదావరి జిల్లాల ప్రజల అన్ని విధాలా సహకరించారని ఆయన చెప్పారు. రాజమండ్రిలో ఓ ఇల్లాలు భక్తుల కోసం వంట వండి, ఆమె కుమార్తెతో సైకిల్‌పై పంపించి, భక్తులకు ఉచితంగా పంపిణీ చేయించిందని, ఈ సంఘటన తనను ఎంతగానో కదిలించిందని చంద్రబాబు చెప్పారు.
విఐపిలకు ఆహ్వానం
కృష్ణా పుష్కరాలకు హాజరు కావల్సిందిగా రాష్టప్రతి, ప్రధాన మంత్రి, లోక్‌సభ స్పీకర్, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆహ్వానించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించామని, కృష్ణా పుష్కరాలను ఇందుకు విజయ సంకేతంగా, భవిష్యత్‌లో జరగనున్న నదుల అనుసంధానానికి ప్రతీకగా భావిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

చిత్రం... పుష్కర ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న సిఎం చంద్రబాబు