ఆంధ్రప్రదేశ్‌

అంత్య పుష్కరాల ముగింపునకు ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 25: గోదావరి నది అంత్య పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించి పుష్కరుడుని ఘనంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేపట్టారు. దేశంలో ఏ నదికీ లేని విధంగా ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఒక్క గోదావరి నదికి మాత్రమే సొంతం. అతి ప్రాచీన నది గోదావరికి సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఘనంగా పుష్కరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ నెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు గోదావరి నదికి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి నదికి అంత్య పుష్కరాలు ముగిసిన మరుసటి రోజు నుంచే కృష్ణా నదికి పుష్కరాలు మొదలవుతాయి. పుష్కరుడు గోదావరి నది నుంచి కృష్ణా నదిలో ప్రవేశిస్తాడు. గురుడు సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి పుష్కరాలు ఎలాగో, అదే విధంగా గురుడు కన్యారాశిలో ప్రవేశించినపుడు కృష్ణా పుష్కరాలు ఆరంభమవుతాయి. ఏడాది పాటు సింహరాశిలో గడిపిన గురుడు ఆగస్టు 11వ తేదీ మరుసటి రోజు నుంచి కన్యారాశిలో ప్రవేశం ద్వారా కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 11వ తేదీన గోదావరి నదిలో వీడ్కోలు పలుకుతారు.