ఆంధ్రప్రదేశ్‌

డిఎస్సీ షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 31: రాష్ట్రంలో ఖాళీగావున్న 8086 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కోర్టు వివాదాల కారణంగా డిఎస్సీకి జాప్యం జరిగిందన్నారు. ఆదివారం ఇక్కడ సర్క్యూట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్సీ షెడ్యూల్‌ను వెల్లడించారు. ఫిబ్రవరి 1న డిఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. 5న ఎంపికైన అభ్యర్థుల జాబితాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తయారు చేస్తుంది. 8న జిల్లా సెలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను నిర్ధారణ చేస్తుంది. 9నుంచి 15వరకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల తనిఖీ, ఆన్‌లైన్‌లో అప్‌లోడింగ్ చేపడతారు. 17న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనర్హుల జాబితాను వెల్లడిస్తుంది. 22న జిల్లాస్థాయిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రీజనరేట్ చేస్తారు. 24న డిఇఒలు పాఠశాలల వివరాలను అందజేస్తారు. 25న రివైజ్డ్ సెలక్షన్ లిస్టులోని అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 29న ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మార్చి 1నుంచి 4వరకు అభ్యర్థులకు వెబ్ కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. 5న పోస్టింగ్ ఉత్తర్వులను అందజేస్తారని మంత్రి గంటా వివరించారు. ఇదిలావుండగా, మరో వారంలో కోర్టు తీర్పు వెలువడిన తరువాత మిగిలిన ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.
జంబ్లింగ్‌లోనే ఇంటర్ పరీక్షలు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో 723 కేంద్రాల్లో పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. వీటిలో 378 ప్రభుత్వ కళాశాలలు, 101 ఎయిడెడ్, 237 ప్రైవేటు కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,99,318 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.