ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్భ్రావృద్ధికి భారీ లక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: రాష్ట్రంలో ఈ ఏడాది స్థిరమైన రెండంకెల వృద్ధి రేటు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించింది. 2022 నాటికి ఏపిని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపేందుకు, అన్ని రంగాల్లో సమ్మిళిత వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఏడు మిషన్లను తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వివిధ రంగాల్లో రాష్ట్రంలో జరిగే స్థూల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం పలు వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ ఏడాది ప్రస్తుత ధరల్లో 6,66,634 కోట్ల గ్రాస్‌వేల్యూ యాడెడ్-విలువల ఆధారిత రేటు (జివిఏ) సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రాథమిక రంగంలో రూ. 2,02,365 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ. 1,52,706 కోట్లు, సేవల రంగంలో రూ. 3,11,563 కోట్లు సాధించాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాలను సాధించడానికి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసింది. వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమలను లాభసాటిగా చేయడం కోసం ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. 2014-15లో రాష్ట్రంలో జిఎస్‌డిపి 7,98 శాతం వృద్ధి సాధించింది. అదే 2015-16లో జిఎస్‌డిపి రూ. 4,93,641 కోట్లతో 10.99 శాతం వృద్ధి సాధించింది. జాతీయ వృద్ధిరేటు కన్నా మన రాష్ట్ర వృద్ధిరేటు 3.42 శాతం అదనంగా సాధించడం గమనార్హం.
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం
రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరగనుంది. పుష్కరాల ఏర్పాట్లు, సెక్రటేరియట్ నిర్మాణం, హెచ్‌ఓడి కార్యాలయాల తరలింపు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి, సలహాదారులు, మంత్రులతో భేటీ కానున్నారని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. వనం - మనం, పుష్కరాలు, పరిపాలనలో సాంకేతికత గురించి ఐదు గంటలకు పైగా చర్చించనున్నారు. ఈ నెల 29న వనం - మనం కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలచడంలో యంత్రాంగం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని సిఎం అధికారులకు నిర్దేశించనున్నారని ప్రభాకర్ తెలిపారు. నదులకు, మనకు మధ్య అవినాభావ సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ జీవనదులను పూజించే మంచి సంప్రదాయాన్ని పుష్కరాల ద్వారా నెరవేర్చాలని సిఎం భావిస్తున్నారు.