ఆంధ్రప్రదేశ్‌

మూసేసుకుంటాం..అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 25: తగినంత సంఖ్యలో ప్రవేశాలు లేకపోవడంతో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. మూసివేతకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది 15 కళాశాలలు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ)కు దరఖాస్తు చేయడం గమనార్హం. దీనికి తోడు కొన్ని విభాగాలను మూసివేతకు అనుమతించాలని కోరుతూ కొన్ని కళాశాలలు దరఖాస్తు చేశాయి. చాలా కళాశాలల్లో ఫీజు పెంపు, సౌకర్యాల లేమి, బోధనా సిబ్బంది కొరత వంటి సమస్యల కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో లెక్కకు మిక్కిలిగా ఏర్పాటైన ఇంజనీరింగ్ కళాశాలల్లో సౌకర్యాలు, తదితర అంశాలపై విద్యార్థులు, వారి తల్లితండ్రులు అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల కంటే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం తెలిసిందే. భారీగా సీట్లు మిగిలిపోవడం, కొన్ని కళాశాలల్లో తక్కువ మంది చేరడం వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012లో 56 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేతకు దరఖాస్తు చేశాయి. రాష్ట్ర విభజన తరువాత కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. 2012-13 సంవత్సరంలో 22 కళాశాలలు, 2013-14 సంవత్సరంలో 27, 2014-15 సంవత్సరంలో 10, 2015-16 సంవత్సరంలో 9 ఇంజనీరింగ్ కళాశాలలను మూసివేశారు. 2015లో దాదాపు 43వేల సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఈ ఏడాది తుది విడత కౌనె్సలింగ్ ఉన్నప్పటికీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరే అవకాశం లేదని, దీంతో భారీ సంఖ్యలో సీట్లు మిగలవచ్చని భావిస్తున్నారు. చాలా కళాశాలలకు ఫీజు పెద్ద సమస్యగా మారింది. కొన్ని కళాశాలలకు గరిష్టంగా 1.08 లక్షల రూపాయలను ఫీజుగా నిర్ణయించారు. ఫీజులో మార్పుల కారణంగా 35 వేల రూపాయలు ఫీజు ఉన్న కళాశాలల సంఖ్య 220 నుంచి 62కు పడిపోయింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను కూడా 35 వేల రూపాయలకే పరిమితం చేయడంతో చాలా కళాశాలల్లో విద్యార్థులు ఆర్థిక భారం కారణంగా చేరేందుకు వెనుకంజ వేస్తున్నారు. 2015-16 సంవత్సరంలో 0-10 మంది విద్యార్థులు చేరిన కళాశాలల సంఖ్య 50 ఉండటం గమనార్హం. ఫీజు వ్యవహారానికి తోడు నాణ్యమైన బోధన, వౌలిక సదుపాయల లేమి, పరికరాల కొరత వంటి అంశాలు కూడా ఇంజనీరింగ్ ప్రవేశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని కళాశాలలు మూసివేతకు దరఖాస్తు చేయగా, మరికొన్ని కళాశాలలు కొన్ని కోర్సుల మూసివేతకు దరఖాస్తు చేయడం గమనార్హం. 2015-16 సంవత్సరంలో 74 కోర్సుల నిర్వహణను నిలిపివేశాయి. ఈ ఏడాది కూడా చాలా కళాశాలలు డిమాండ్ లేని కోర్సులను నిలిపివేసేందుకు ఎఐసిటిఇకి దరఖాస్తు చేశాయి. పేరున్న కళాశాలలు కొన్ని బ్రాంచ్‌ల్లో అధిక సంఖ్యలో సెక్షన్లను ఏర్పాటు చేయడం కూడా కొన్ని కళాశాలల్లో ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది.