ఆంధ్రప్రదేశ్‌

అధిక ధరలపై 17న దేశవ్యాప్త ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: తెలంగాణ రాష్ట్రంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకున్న నిర్వాసితులపై ప్రభుత్వం నిరంకుశంగా దాడులకు పాల్పడటం అన్యాయమని, ఈ దాడుల్లో 28 మంది తీవ్రంగా గాయపడగా, ఒక మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన ప్రజల్ని అదుపు చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఆందోళనకారులకు సంఘీభావం తెలిపేందుకు, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిడిపి నేతల్ని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. తెలంగాణలో పోలీసు ఆటవిక రాజ్యం కొనసాగుతోందని ఆయన సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలకు నిరసనగా ఆగస్టు 17న ధరల వ్యతిరేక ఆందోళన చేపట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేట్‌పరం చేసేందుకు సాగుతున్న కుట్రల్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 2న పెద్దఎత్తున జాతీయ స్థాయిలో జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు తెలుపుతున్నట్లు నారాయణ వివరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆగస్టు 5న మరోమారు చర్చకు రానున్న ప్రత్యేక హోదా బిల్లును ఆమోదింపజేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలన్నారు. అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలన్నారు.