ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమ 13వ మోటార్ పని ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: పట్టిసీమ పథకం 13వ మోటార్ పంపు సోమవారం నుండి పని ప్రారంభించింది. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం మాట్లాడుతూ 13 పంపుల ద్వారా రోజుకు 4600 క్యూసెక్కుల గోదావరి నీరు కృష్ణా బ్యారేజీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి రోజుకు 4వేల క్యూసెక్కుల నీటిని ఆయా కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా వచ్చిన 3.26 టిఎంసిల గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు విడుదల చేశామన్నారు. ఈ సీజన్‌లో ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీకి 817 టిఎంసిల గోదావరి నీరు చేరిందని, ఇందులో 787 టిఎంసిలు వృథాగా సముద్రంలోకి వదిలివేయాల్సి వచ్చిందన్నారు. ఉభయగోదావరి జిల్లాల రైతులకు 29.8 టిఎంసిల సాగునీటిని అందించామన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండి కృష్ణానీరు శ్రీశైలానికి తరలివస్తుందని మంత్రి చెప్పారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును కర్నాటక ప్రభుత్వం 519 నుండి 524 మీటర్ల ఎత్తుకు పెంచడం వల్ల దిగువ ప్రాంతాల్లోని రైతాంగానికి పూర్తి నష్టం చేకూరిందన్నారు.