ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ప్రముఖ విద్యా సంస్థల ఏర్పాటు లేనట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 25: విశాఖలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థల ఏర్పాటు ఇక లేనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సంస్థలు ఏర్పాటు కావడంతో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే రెండు విద్యా సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కగా, మరో రెండింటిని కాకినాడకు తరలించేందుకు నిర్ణయించారు. విభజన హామీల్లో భాగంగా కేంద్రానికి చెందిన వివిధ విద్యా సంస్థలను ఏర్పాటుకు నిర్ణయించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖలో ఈ ఏడాది నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐఐఎం పని చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్‌లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి విశాఖలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (నైపర్)ను ఈ ఏడాది విశాఖలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభించడం లేదని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ శాఖను కూడా విశాఖలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇందుకు భీమిలి మండలం అన్నవరం సమీపంలో 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చింది. అయితే సాంకేతిక కారణాలతో ఇది సాధ్యం కాదని అధికారులు చెపుతున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ (్ధన్‌బాద్)కు ఇటీవల ఐఐటి హోదా కల్పించారు. ఇప్పటికే ఐఐటి ఉన్న రాష్ట్రంలో వేరే రాష్ట్రానికి చెందిన ఐఐటి తన శాఖను ఏర్పాటు చేసే వీలులేదు. దీంతో ఐఐఎం ఏర్పాటుకు సాంకేతికపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇక విశాఖలో ఏర్పాటుకు తొలుత ప్రతిపాదించిన రెండు ప్రముఖ విద్యా సంస్థలు కూడా కాకినాడలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. పురంధ్రీశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టి) సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జిల్లాలో గంభీరం వద్ద ఏర్పాటుకు వీలుగా ఆ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అధికారులు కూడా స్థల పరిశీలన చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపి) సెంటర్‌ను కూడా ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి స్థలం కేటాయింపునకు జిల్లా అధికారులు ముందుకు వచ్చారు. విశాఖలో ఇప్పటికే రెండు ప్రముఖ విద్యా సంస్థల ఏర్పాటు కావడం, సబ్బవరం వద్ద ఎడ్యుకేషన్ సిటీని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో విశాఖలో అన్ని ప్రముఖ విద్యా సంస్థలు కేంద్రీకృతం కావడంతో వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఐఐఎఫ్‌టి, ఐఐపిలను కాకినాడలో ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది.