ఆంధ్రప్రదేశ్‌

అధినేత ఆదేశంతోనే మంగళగిరి నుంచి పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 14: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకే గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్నానని, చేనేత వర్గాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నుంచి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న లోకేష్ గురువారం రాత్రి మంగళగిరిలో ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి పర్యటించి ముఖ్యనేతల నివాసాలకు వెళ్లి గెలుపునకు సహకరించాలని అభ్యర్థించారు. తొలుత టీడీపీ ఇన్‌చార్జ్, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి నివాసానికి చేరుకుని మంతనాలు జరిపారు. చిరంజీవి రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ విలేఖర్లతో మాట్లాడుతూ 1985 ఎన్నికల తరువాత మంగళగిరిలో టీడీపీ విజయం సాధించలేదని, 1989, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో వామపక్షాలు, బీజేపీ అభ్యర్థులకు టీడీపీ మద్దతు ఇచ్చిందని, 2014 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని లోకేష్ అన్నారు. గడిచిన మూడేళ్లుగా మంగళగిరి నియోజకవర్గంలోనే తాను నివాసం ఉంటూ సమస్యలు తెలుసుకుంటున్నానన్నారు. కులం, మతం, ప్రాంతం తనకు లేవని ఎవరైనా అడిగితే ఆంధ్రుడిని అని గర్వంగా చెబుతానని, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి అందుబాటులో ఉండి అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలు తమవెంట ఉన్నంత వరకు కేసీఆర్, జగన్, నరేంద్రమోదీలు ఏం చేయలేరని లోకేష్ అన్నారు. మంగళగిరి ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పామని, విభజన తరువాత రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితుల్లో అందిరకీ ఆమోద యోగ్యంగా ఉండే ప్రాంతంగా మంగళగిరిని గుర్తించి రాజధానిగా ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో వీరోచితంగా మాట్లాడి నరేంద్రమోదీని ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై నిలదీశారన్నారు. వచ్చే ఎన్నికల తరువాత టీడీపీ మద్దతుతోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం రాబోతోందని లోకేష్ అన్నారు. బీసీ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిపై అడిగిన ప్రశ్నకు లోకేష్ స్పందిస్తూ ఎమ్మెల్సీలుగా అనేక మంది బీసీలకు పార్టీ అవకాశం కల్పించిందని, బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని, బీసీలే పార్టీకి పునాది అని లోకేష్ పేర్కొన్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్, వైస్‌చైర్మన్ గుత్తికొండ ధనుంజయరావు, జడ్‌పీటీసీ మెంబర్ ఆకుల జయసత్య పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం లోకేష్ రాత్రి పొద్దుపోయే వరకు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందం అబద్దయ్య, పూర్వ ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాస్ తదితరుల నివాసాలకు వెళ్లి వారి మద్దతు కోరారు.
చిత్రం.. విలేఖర్లతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్