ఆంధ్రప్రదేశ్‌

జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన దాసరి నారాయణ కుమారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: దివంగత నిర్మాత, దర్శకరత్న దాసరి నారాయణ రావు తనయుడు దాసరి అరుణ్ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం అరుణ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని అన్నారు. జగన్ ఆదేశిస్తే ప్రచారం నిర్వహిస్తాననని ఆయన తెలిపారు. దాసరి నారాయణ రావు బతికి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వారని అన్నారు.
అలాగే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గురువారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నేతృత్వంలో లబ్బి పార్టీలో చేరారు. ఇలాఉండగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ శుక్రవారం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మరణశాసనం తప్పదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దోపిడీ, అవినీతి విచ్చల విడిగా జరిగిందని, జన్మభూమి కమిటీలు దోపిడీ కమిటీలుగా మారాయని ఆయన విమర్శించారు.