ఆంధ్రప్రదేశ్‌

జనసేన, వామపక్షాల మధ్య దాదాపు కుదిరిన పొత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: జనసేన, వామపక్షాల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లే. అయితే శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఈ పొత్తులు అధికారికంగా ఖరారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన తరపున నాదెండ్ల మనోహర్, సీపీఎం తరపున రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు, రాష్ట్ర నేతలు వై వెంకటేశ్వరరావు, వీ శ్రీనివాసరావు, సీపీఐ తరపున రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, రాష్ట్ర నేతలు జల్లి విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ హాజరయ్యారు. వామపక్షాలు తరపున ప్రతి జిల్లాలో కనీసం ఒక అసెంబ్లీ, రాష్ట్రం మొత్తంపై రెండేసి ఎంపీ సీట్లు కేటాయించాలని గట్టిగా కోరాయి. అయితే వామపక్షాలు అడిగినన్ని సీట్లకు తొలుత పవన్ కళ్యాణ్ సుముఖత ప్రదర్శించలేదు. దీంతో చర్చలు అర్ధంతరంగా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వామపక్షాలు విడివిడిగా తమతమ కార్యాలయాల్లో తమ పార్టీలోని ఇతర నేతలతో కల్సి చర్చలు జరుపుకుని చెరి మూడు అసెంబ్లీ సీట్లను తగ్గించుకుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చెరి పది అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంట్ సీట్లకు పోటీ చేయాలన్న నిశ్చయానికి వచ్చారు. దీనికి ఇంకా జనసేన ఆమోదం తెలపాల్సి ఉంది. ఇలాఉంటే కొత్తగా బీఎస్పీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించే సీట్లపైనా జనసేనలో చర్చలు జరుగుతున్నాయి.