ఆంధ్రప్రదేశ్‌

సాగర్ కాలువ 3వ జోన్‌కు తాగునీరు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: నాగార్జునసాగర్ ఎడవ కాలువ మూడవ జోన్ పరిధిలోని కృష్ణాజిల్లా ప్రాంతాలకు తాగునీరు విడుదల చేయాలని తెలంగాణ ఈఎన్‌సీకి ఏపీ సాగునీటి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14వ తేదీన జరిగిన కృష్ణానది యాజమాన్యం బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంలో తాగునీటి అవసరాల కోసం 3 టీఎంసీలు కేటాయిస్తూ నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తక్షణం ఈ ఉత్తర్వులను అమలు చేసి నాగార్జున సాగర్ ఎడవ కాలువ రెండు, మూడు జోన్లకు రోజుకు 1500 క్యూసెక్కులు చొప్పున ఈ నెల 22 నుండి ఏప్రిల్ నెల 2వ తేదీ వరకు నిరాటంకంగా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నాదేళ్ల చెన్న కేశవరావు తదితరులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జలసౌధ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇఎన్‌సీ) సి మురళీధర్‌ని స్వయంగా శనివారం కలిసి పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించారు.