ఆంధ్రప్రదేశ్‌

పింఛన్లపై ప్రత్యేక ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో పింఛను పథకంతో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 200 నుంచి ఏకంగా వెయ్యి రూపాయలు అందుకుంటున్న వారి సంతోషం పార్టీకి-ప్రభుత్వానికి అనుకూలంగా మారలేకపోతోంది. అం దుకే బాబు ‘్భరోసా’పథకంపై సీరియస్‌గా దృష్టి సారించారు. పింఛన్లపై భారీ స్థాయిలో గ్రామసభల వేదికగా ప్రచారం సాగాలన్న లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత భరోసా పథకం పేరుతో 200 రూపాయలున్న పింఛన్లను వెయ్యి రూపాయలకు పెంచి, పింఛనర్ల పెదవులపై చిరునవ్వులు పూయించిన బాబు సర్కారు, అందుకు తగిన ప్రచారం లభించకపోవడంపై సీరియస్‌గా దృష్టి సారించింది. వీటికోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నా అందుకు తగిన ప్రచారం రావడం లేదని గ్రహించిన సర్కారు, గ్రామసభల్లో ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారన్న అంశంతోపాటు, వారి పేర్లను కూడా చదవడం ద్వారా సంబంధిత గ్రామంలో, ఎంతమంది పింఛన్లు పొందుతున్నారో అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఏపిలో మొత్తం 577,42,69 మంది పింఛనుదారులుండగా, వికలాంగులకు 500 నుంచి 1500 రూపాయలిస్తున్నారు. ఈనెలలో ఇప్పటివరకూ 456,80,15,000 రూపాయలను భరోసా పథకంలోని పింఛనుదారులకు అందించింది. రాష్ట్రంలో 216 కోట్ల 88 లక్షల 15 వేల రూపాయలను వృద్ధాప్య పింఛన్ల కింద 20,90,707 మందికి అందిస్తున్నారు. 14,35,228 మంది వితంతులు 149,94లక్షల 69 వేల రూపాయలు అందకుంటున్నారు. 5,03,452 మంది వికలాంగులు 63 కోట్ల 64 లక్షల 3వేల రూపాయలు అందుకుంటున్నారు. 70,074 మంది చేనేత కార్మికులకు, 7కోట్ల 21 లక్షల 20 వేల రూపాయలు పింఛన్లు ఇస్తున్నారు. 12,913 మంది గీత కార్మికులు కోటీ 32 లక్షల 61 వేల పింఛన్లు తీసుకుంటున్నారు. 39,842 మంది కళాకారులకు 3 కోట్ల 98 లక్షల 42 వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు.
ఇందులో వృద్ధుల తర్వాత వితంతు, వికలాంగుల పెన్షనే్ల ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెన్షన్ల తీరును పరిశీలిస్తే..గ్రామీణ ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో 78.96, శ్రీకాకుళంలో 92.16 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా విశాఖలో 24.48 శాతం, శ్రీకాకుళంలో కనిష్టంగా 7.84% ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 475.830 మంది పింఛన్లు తీసుకుంటుండగా, కడపలో తక్కువగా 251.202 మంది తీసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కాగా ప్రభుత్వం-పార్టీ నిరంతరం చేయిస్తున్న సర్వేలో, అన్ని పథకాల కంటే పింఛన్లకే ఎక్కువ ప్రజాదరణ, సంతృప్తి ఉందని వెల్లడయింది. అయినప్పటికీ, అది పార్టీకి అనుకూలంగా మారడం లేదన్న విషయాన్ని నాయకత్వం గ్రహించింది. ముఖ్యంగా నిరక్షరాస్యులు తమకు వెయ్యి రూపాయల పింఛను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఇందిరమ్మ ప్రభుత్వం వల్లే వస్తోందని భావిస్తున్నారు. అందుకే గ్రామసభల్లోనే లబ్ధిదారుల వివరాలు ప్రస్తావించడం ద్వారా, ప్రభుత్వానికి అనుకూల ప్రచారం కల్పించవచ్చని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.

వృద్ధుడిని ఓదారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు (ఫైల్ ఫొటో)