ఆంధ్రప్రదేశ్‌

21, 22 తేదీల్లో ముమ్మరంగా నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: వివిధ రాజకీయ పక్షాలకు గతంలో ముందెన్నడూ లేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో సీటు దక్కడమే కష్టమైన పరిస్థితుల్లో దాదాపు అభ్యర్థులందరూ తమతమ జన్మనక్షత్రాలు బట్టి కాస్తంత మంచి రోజున తమ నామినేషన్‌లు దాఖలు చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. అయితే వాస్తవానికి ఈ ఐదు రోజులు కూడా దాదాపు అందరికీ అనుకూలమైనవే. అయితే ఈ నెల 21, 22 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నందున ఆ రెండు రోజుల్లో అత్యధికులు నామినేషన్‌లు దాఖలు చేసే అవకాశాలున్నాయని ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వరశర్మ ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. 21వ తేదీ పౌర్ణమి రోజు మంచిదే అని, అయితే అత్యుత్తమ ఉత్తర నక్షత్రం ఆ రోజు మధ్యాహ్నం 1.35 నిమిషాలకు వస్తుందన్నారు. నామినేషన్ దాఖలు గడువు మూడు గంటల వరకు ఉండటంతో అత్యధికులు మధ్యాహ్నం 1.30 నుండి మూడు గంటల మధ్య నామినేషన్‌లు దాఖలు చేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఇక ఈ ఉత్తర నక్షత్రం 22వ తేదీ ఉదయం 11.08 నిమిషాల వరకు ఉండటంతో కొందరు ఆ రోజు ఉదయం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. తొలిరోజు 18వ తేదీ ద్వాదశి మంచిరోజే అయినా చెప్పుకోదగ్గ సంఖ్యలో నామినేషన్‌లు దాఖలు కాలేదు. 19వ తేదీ త్రయోదశి, 20వ తేదీ చతుర్దశి, అయితే పౌర్ణమి ముందు చతుర్దశి మంచిరోజేనంటున్నారు. 23, 24 తేదీలు ఎటూ సెలవులే. ఆ రెండు రోజుల్లో నామినేషన్‌ల దాఖలు కార్యక్రమాలు ఉండవు. చివరి రోజైన 25వ తేదీ పంచమి కూడా మంచిదే కావటంతో మిగిలిన వారందరూ ఆ రోజు నామినేషన్‌లు దాఖలు చేయబోతున్నారు.