ఆంధ్రప్రదేశ్‌

వారెన్ని కుట్రలు పన్నినా సైకిల్‌దే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 18: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులు ఎంతటివారైనా వదిలేది లేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని మినీస్టేడియంలో సోమవారం జిల్లాలోని సేవామిత్రలు, బూత్‌కమిటీ సభ్యులతో ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వివేకానందరెడ్డిని ఇంటిలోనే హత్య చేస్తే ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేలా వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారన్నారు. గుండెపోటుతో మృతి చెందారని బయట ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత జగన్ కుటుంబానికే చెల్లిందన్నారు. హత్య జరిగిన రోజు ఉదయం 9.15 గంటలకు ఒక ఛానల్‌లో గుండెపోటుతో మృతి చెందారని నాటకాలు ఆడారన్నారు. కనీసం జిల్లా ఎస్‌పికి, పోలీసులకు సమాచారం అందించకుండా హాస్పటల్‌కు తరలించారన్నారు. ఐదున్నర గంటలకు పీఏ వచ్చారని, ఆరు గంటలకు పనిమనిషి వచ్చేసరికి ఆయన శవమై కనిపించారన్నారు. గది అంతా రక్తం మరకలతో ఉన్నా బయట ప్రపంచానికి మాత్రం గుండెపోటుతోనే మృతి చెందారని నమ్మబలికారన్నారు. టీడీపీ సీనియర్ నేత పరిటాల రవిని ఆయన ఆఫీసులోనే చంపి కేసులు లేకుండా వైఎస్ కుటుంబం చేసిందని, హత్యా రాజకీయాలకు, శవరాజకీయాలకు వైఎస్ కుటుంబం పెట్టింది పేరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తండ్రిని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేశారని, ప్రస్తుతం అధికారం లేకపోయినా జగన్ అవే రాజకీయాలకు పాల్పడుతున్నారని ఇలాంటివారికి రాష్ట్రాన్ని అప్పగిస్తే రాష్ట్రం అధోగతి పాలౌతుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ప్రజల అభిమానంతో తాను భూస్థాపితం చేస్తానే తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయమన్నారు. కోడి కత్తి డ్రామాలో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఎతో విచారణ చేపట్టిందన్నారు. వివేకా హత్య కేసులో నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరపాలని ఆదేశించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో సైకిల్ జోరుకు అన్ని పార్టీలు కొట్టుకుపోతాయన్నారు. కేసీఆర్ తమ డేటాను దొంగిలించి వైకాపా నేతలకు ఇచ్చారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌తో ఫెడరల్ ఫ్రంట్ మోదీ పెట్టించారని అందులో జగన్ కూడా భాగస్వామి అన్నారు. తెలుగు జాతిని కేసీఆర్ ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన వైకాపా నేతలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారని విమర్శించారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసీఆర్, జగన్‌లు కుట్ర పన్నారని ఆరోపించారు. వచ్చేనెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలను గెలిపించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు సానుకూలంగా ఉన్నారని, పార్టీ శ్రేణులందరు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. రాష్ట్రంలోని 60 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఐదు లక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పించామన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా అర్హులైన ప్రతిఒక్కరికి లబ్ధి చేకూర్చామన్నారు. 45 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 15వేల రూపాయలు ఇస్తున్నామని, 24,500 కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల మందికి పైగా తమపార్టీ వైపు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే కంచుకోట అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రంగంలోకి దించి ఓటర్ల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, బిహార్ నుండి వచ్చిన పికె ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహించారని అందువల్ల తెలుగుతమ్ముళ్లు అందరు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈబహిరంగ సభలో మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, 11 నియోజకవర్గాల అభ్యర్ధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

చిత్రం.. ఒంగోలులో జరిగిన సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు