ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాల్లో విశ్వసనీయతే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 18: రాజకీయాల్లో విశ్వసనీయతే ముఖ్యమని, రాజకీయాల్లో ఉన్న నాయకులు విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారవుతాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు సోమవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాగబాబుకు పార్టీ కండువా కప్పిన పవన్ కళ్యాణ్ పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమన్నారు. దశాబ్దాలుగా పడిన కష్టం ఫలితాన్నివ్వని పరిస్థితుల్లో నాగబాబు పడుతున్న బాధ ఆయనపై పోటీ చేయాల్సిన నాయకుల్ని సైతం కదిలించిందన్నారు. జనసేనపార్టీ బలపడాలన్న ఏకైక లక్ష్యంతో స్థానిక జనసేన శ్రేణులు సైతం మా అందరికంటే ఆయన అయితే గెలుపు ఖాయమంటూ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చినందకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయన్నారు.
దశాబ్దాలుగా చేసిన శ్రమని ఇతర పార్టీలు గుర్తించవేమో గానీ జనసేన పార్టీ మాత్రం తప్పకుండా గుర్తిస్తుందన్నారు. జనసేన పార్టీ పాలకొల్లులో ఘనవిజయం సాధించాలని కోరుతున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో బలమైన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా గుణ్ణం నాగబాబుతో పాటు పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వందల మంది కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

చిత్రం.. పాలకొల్లు వైసీపీ నేత నాగబాబుకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానిస్తున్న పవన్‌కళ్యాణ్