ఆంధ్రప్రదేశ్‌

మద్యం ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ఎక్సయిజ్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రత్యేకించి కమిషనరేట్ వేదికగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్రమ మద్యంపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో కీలక భూమికను పోషిస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన తరువాత రాష్టస్థ్రాయిలో ఇప్పటివరకు 306 ఫిర్యాదులు రాగా క్షేత్రస్థాయిలోని యంత్రాంగం వీటిపై తక్షణ చర్యలు తీసుకోవటంలో వేగవంతమైన కార్యాచరణను చూపుతోంది. బుధవారం సాయంత్రానికి నమోదైన 306 ఫిర్యాదుల్లో 263 పరిష్కరించారు. వీటిలో 170 అభియోగాలకు సంబంధించి కేసులు నమోదు చేసి చర్యలకు ఉపక్రమించగా, మరో 93 ఫిర్యాదుల విషయంలో అవి తప్పుడు ఫిర్యాదులుగా స్పష్టం అయ్యాయి. మద్యం ఫిర్యాదులకు సంబంధించి అత్యధికంగా గుంటూరులో 42, తూర్పు గోదావరి జిల్లాలో 41, శ్రీకాకుళంలో 34 నమోదు కాగా అతి తక్కువగా ప్రకాశంలో 6, చిత్తూరులో 7, విజయనగరంలో పది నమోదు అయ్యాయని ఎక్సయిజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 32 చొప్పున, పశ్చిమ గోదావరిలో 27, కర్నూలులో 26, అనంతపురంలో 20, నెల్లూరులో 17, కడపలో 12 నమోదు అయ్యాయి. ఇప్పటికే 31 సరిహద్దు చెక్ పోస్టులు ఉండగా, ఎన్నికల నేపథ్యంలో కొత్తగా 37 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామని మీనా తెలిపారు.