ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాల్లో నామినేషన్ల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 20: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గోదావరి జిల్లాల్లో బుధవారం నామినేషన్ల సందడి నెలకొంది. సోమవారం నుండే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా తొలి రోజు ఎవరూ నామినేషన్లు దాఖలుచేయలేదు. రెండో రోజైన మంగళవారం అతి తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ సహా పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. మంత్రి పితాని ఆచంటలో నామినేషను దాఖలుచేశారు. ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ దెందులూరులో నామినేషన్ దాఖలుచేశారు. రాజమహేంద్రవరం టీడీపీ లోక్‌సభ అభ్యర్థిని, సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప రాజమహేంద్రవరంలో, నరసాపురం లోక్‌సభా స్థానానికి వైసీపీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణంరాజు నరసాపురంలో, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉంగుటూరులో దాఖలు చేశారు. దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే చింతమేనని ప్రభాకర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నామినేషన్‌ను అమలాపురంలో దాఖలు చేశారు.