ఆంధ్రప్రదేశ్‌

అధికారం కోసం అడ్డదారుల్లో జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మార్చి 20: ఓటమి భయంతో జగన్మోహన్‌రెడ్డి అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ప్రశాంత్‌కిశోర్ సలహాలతో ఈ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. నియోజకవర్గానికి 15 వేలు వంతున రాష్టవ్య్రాప్తంగా టీడీపీకి చెందిన 15 లక్షల మంది ఓటర్లను తొలగించేందుకు బెంగళూరు, చెన్నై కేంద్రంగా కుట్రలు చేసారన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఫారం-7 దాఖలు చేసి గంపగుత్తగా ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించారన్నారు. ఈ ఓట్ల తొలగింపు గుట్టును మొదట నర్సీపట్నంలోనే గుర్తించామన్నారు. రాష్టవ్య్రాప్తంగా పార్టీ శ్రేణులు అప్రమత్తమై ఓట్ల తొలగింపును అడ్డుకున్నారన్నారు. ఫారం-7 దరఖాస్తులపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు హైకోర్టులో కేసు వేశామన్నారు. ఓట్ల తొలగింపు గుట్టు రట్టు కావడంతో టీడీపీపై వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందంటూ ప్రజల్లో అనుమానాలను కలిగిస్తున్నారన్నారు. ఈ ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మక పోవడంతో పోలింగ్ సందర్భంగా అర్బన్ ప్రాంతాల్లో ఘర్షణలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని వివరించారు. అధికారమే పరమావధిగా వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను పార్టీ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలో ఘర్షణలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.