ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 20: శ్రీవారి తెప్పోత్సవాలు బుధవారం వేడుకగా ముగిశాయి. చివరి రోజున స్వామివారు శ్రీదేవి, భూదేవీ సమేతుడై శ్రీ మలయప్ప స్వామి సర్వాలంకార భూషితుడై కదలివచ్చారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై కొలువుదీరిన స్వామివారు పుష్కరిణిలో ఏడుమార్లు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. బుధవారం ఫాల్గుణ పౌర్ణమి కావడంతో పున్నమి వెలుగుల మధ్య ద్విగుణీకృతమైన వైభవంతో స్వామివారిని తెప్పలపై దర్శించుకున్న భక్తులు చేసిన గోవిందనామ స్మరణలతో పుష్కరిణి ప్రాంతం మారుమోగింది. తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలను, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.