ఆంధ్రప్రదేశ్‌

సిక్కోలు జిల్లా బీజేపీ అధ్యక్షుడిని తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 20: ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక.. బి ఫారాల కేటాయింపు వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. చైతన్యం అడుగడుగున ఉన్న శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ నేతలు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైఖరిని తప్పుబడుతూ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సభలో గందరగోళం సృష్టించి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. నియోజకవర్గాలను అంటిపెట్టుకొని పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాలు నిర్వహించే అభ్యర్థులను పక్కన పెట్టి బలహీనులకు బి పారాలు కేటాయించారంటూ నేతలు, కార్యకర్తలు కార్యాలయంలో ఉన్న ఫొటోలను ధ్వంసం చేశారు. సీనియర్లుగా పార్టీని నమ్ముకొని ఆర్థిక భారాలను మోస్తూ కార్యక్రమాలను నిర్వహించే నేతలను పక్కన పెట్టి నిన్న కాక మొన్న పార్టీలోకొచ్చే నాయకులకు బి ఫారాలు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్సీ సోమువీర్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డౌన్..డౌన్.. జిల్లా అధ్యక్షుడు నారాయణరావును తక్షణమే తొలగించాలని నినాదాలు సాగించారు. కాళింగ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించి సీనియర్లను కించపరిచేలా టికెట్లు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ అధిష్ఠానం జిల్లాలోని శ్రీకాకుళం ఎంపీ, ఆమదాలవలస, టెక్కలి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి ఫారాలను కాళింగ సామాజిక వర్గానికి కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా బీజేపీ సీనియర్లు గుర్తుచేశారు. 2009లో పోటీచేసిన బీజేపీ అభ్యర్థుల కూడా పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా సీట్ల కేటాయించారని ఆరోపించారు. జాతీయ పార్టీ కేటాయించిన ఎన్నికల నిధులను రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ వంతులు వేసుకునేందుకు అభ్యర్థుల ఖరారులో బలహీనులకు కేటాయించారని విమర్శించారు. వ్యాపారాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న సీనియర్లను కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేయడం పట్ల వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సోమువీర్రాజు నిర్వహించే మీడియా సమావేశాన్ని కూడా బహిష్కరించి బీజేపీ కార్యాలయం నుంచి నేతలంతా బయటకొచ్చిన నేతలు పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జి, దుప్పల రవీంద్రబాబు, సువ్వారు వెంకట సన్యాసిరావు, సంపతిరావు నాగేశ్వరరావు, తమ్మినేని గోవిందరావు, సంపతిరావు వెంకటరమణమూర్తి, సువ్వారు రాజేష్‌కుమార్, సంపతిరావు తేజేశ్వరరావు, పేడాడ సూరపునాయుడు, బెండు రవికాంత్ ఆందోళన చేశారు.
చిత్రం..ఎమ్మెల్సీ సోము వీర్రాజును నిలదీస్తున్న శ్రీకాకుళం జిల్లా బీజేపీ నేతలు