ఆంధ్రప్రదేశ్‌

త్వరలో పెన్షనర్ల సంక్షేమ నిధి ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: త్వరలో పెన్షనర్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో బుధవారం జరిగిన ప్రభుత్వ పింఛనుదార్ల సంఘం వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిధి ఏర్పాటుతో పదవీ విరమణ తరువాత ఉద్యోగి ప్రశాంతంగా జీవించేందుకు పింఛను లభిస్తుందన్నారు. ఉద్యోగి ప్రశాంతంగా జీవించేందుకు పింఛను సౌకర్యం ఉండాలన్నారు.
పింఛనుదారులు ప్రశాంతంగా జీవించేందుకు తాను వెన్నుదన్నుగా ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలిపారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు. ఐదేళ్లలో రెండంకెల వృద్ధి సాధించామన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో ఎన్జీవోలు ఇళ్లు కట్టుకుంటుంటే కేసీఆర్ అడ్డుకుంటున్నారని, చట్ట వ్యతిరేకంగా అందరిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, మోదీ, జగన్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. కేసీఆర్ బెదిరించి మన ఆస్తులు తీసుకుంటున్నారని, ఏపీ బాగుపడితే తెలంగాణ అభివృద్ధి వ్యవహారం బయటపడుతుందని భావించి రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఒకే పార్టీ ఉండాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో దౌర్జన్యాలు చేస్తున్నారని, సేవామిత్ర డేటా దొంగిలించి వైకాపాకు ఇచ్చారని ఆరోపించారు. ఏపీ సంస్థ అయినందున ఐటిగ్రిడ్స్‌పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తెలంగాణ కంటే మెరుగైన జీతాలు, పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఏపీని పరోక్షంగా పాలించాలని కేసీఆర్ చూస్తున్నారని, టీడీపీ అభ్యర్థులను పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ విషయంలో తెలంగాణ జోక్యం చేసుకుంటే సహించబోమని హెచ్చరించారు. హేతుబద్ధత లేని విభజన కారణంగా నష్టపోయామని తెలిపారు.
చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరిస్తున్న పింఛనుదారులు