ఆంధ్రప్రదేశ్‌

కనీవినీ ఎరుగని రీతిలో మద్యం, నగదు ప్రవాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల సమయంలో మద్యం, నగదు ప్రవాహం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియకు ముందే భారీగా నగదు, బంగారం, వజ్రాలు పట్టుబడుతున్నాయన్నారు. ఎన్నికల్లో మద్యం ప్రవాహంపై నిఘా ఉందని, గత ఏడాది ఇదే సమయానికి ఎంత మేర విక్రయాలు జరిగాయన్న అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు వీలుగా నిల్వ చేసిన 10 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్నామని, 2014 ఎన్నికల్లో మొత్తం పట్టుబడిన మద్యం విలువ 9 కోట్ల రూపాయలు మాత్రమేనని గుర్తు చేశారు. పోలీసుల తనిఖీల్లో 5.03 కోట్ల రూపాయల నగదు, 30.82 కిలోల బంగారం, 24.168 కిలోల వెండి, 16 వజ్రాలు, 33 కేజీల గంజాయి, 38.31 లక్షల విలువైన ఖైనీ, 4 వేల చీరలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.