ఆంధ్రప్రదేశ్‌

సచివాలయ భద్రతకు ప్రత్యేక దళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రక్షణ దళం త్వరలోనే రాజధాని ప్రాంతంలో రక్షణ బాధ్యతలను స్వీకరించనుంది. తొలుత 400 మంది సిబ్బంది సచివాలయం ప్రాంగణంలో విధులు చేపట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఎపిఎస్‌పి ఫోర్స్ విజయవాడ జోనల్ అధికారి, కమాండెంట్ డాక్టర్ కెఎన్ రావు ఆధ్వర్యంలో దాదాపు 400 మంది ఒకే డ్రెస్‌కోడ్‌తో 30 తేదీ ఉదయం 5 గంటలకు దుర్గగుడి నుంచి ప్రకాశం బ్యారేజి కరకట్ట, వెంకటాయపాలెం మీదుగా సైకిల్ ర్యాలీతో వెలగపూడి సచివాలయంకు చేరుకుంటారు. తిరిగి అదే మార్గంలో విజయవాడకు చేరనున్నారు. ఈ ర్యాలీ ద్వారా సిబ్బందికి పరిసర ప్రాంతాలపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ సైకిల్ తొక్కడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో విశదీకరిస్తామని డాక్టర్ కెఎన్ రావు తెలిపారు. ఇదిలా వుండగా ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న డాక్టర్ రావుకు ఇదే సందర్భంలో వీడ్కోలు పలుకుతారు.