ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రి హోలీ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందకేళి హోలీ అని, అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండే ఆనందాంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని తెలిపారు. ప్రజాశ్రేయస్సు కోసం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ పయనం సాగిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యానికి హాని కలిగించే కృత్రిమ రంగులకు బదులు ప్రకృతి సిద్ధమైన రంగులు ఉపయోగించాలని సూచించారు. నదులు, సముద్రాలు, చెరువుల్లో ఈత కొడుతూ ప్రమాదాలకు గురి కావద్దని హితవుపలికారు. జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఇలా ఉండగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఏటా హోలీ వేడుకలను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రద్దు చేశారు. ఇటీవల పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల చేతుల్లో మరణించినందు వల్ల వేడుకలను రద్దు చేసినట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. సాధరణంగా రాజ్‌భవన్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ పర్యాయం వేడుకలు లేకపోవడంతో రాజ్‌భవన్ బోసిపోయింది.