ఆంధ్రప్రదేశ్‌

సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి వివేకానంద కుమార్తె సునీతా రెడ్డి ఫిర్యాదు చేశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఫిర్యాదు అందచేశారు. తన తండ్రి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రే సిట్ విచారణను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు సంస్థపై ముఖ్యమంత్రి ఒత్తిడి ఉంటే కేసు పక్కదారిపట్టే అవకాశం ఉందన్నారు. సిట్ విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కొన్ని పేపరు క్లిప్పింగ్‌లను కూడా ఫిర్యాదుతో జత చేశారు. తాను బుధవారం మీడియాతో మాట్లాడిన అంశాలనే సీఈవో దృష్టికి తీసుకువెళ్లినట్లు మీడియాకు ఆమె తెలిపారు. దీనిపై సీఈవో స్పందిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ ఫిర్యాదును తీసుకువెళ్తామని తెలిపారు.