ఆంధ్రప్రదేశ్‌

ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అదే తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 21: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గురువారం కూడా నామినేషన్ల జోరు కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బొమ్మూరు ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా ఆకుల వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌రామ్ నామినేషన్ వేశారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. రాజోలు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నామినేషన్ దాఖలు చేశారు. పి.గన్నవరం నియోజకవర్గానికి జనసేన అభ్యర్థినిగా పాముల రాజేశ్వరి దేవి నామినేషన్ వేశారు. రంపచోడవరం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థినిగా వంతల రాజేశ్వరి నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గానికి అలాగే వైసీపీ తరపున నాగులాపల్లి ధనలక్ష్మి, సీపీఎం అభ్యర్థిగా సున్నం రాజయ్య నామినేషన్లు వేశారు. కాకినాడ నగర అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రవికిరణ్ నామినేషన్ వేశారు.
ప.గో.జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీ్ధర్ నాలుగుసెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ తరపున నాగం చంద్ర నాగ శివప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా గుణ్ణం నాగబాబు నామినేషన్ వేశారు. తాడేపల్లిగూడెం టీడీపీ అభ్యర్థిగా ఈలి నాని నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గానికి జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. ఉంగుటూరు టీడీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నామినేషన్ వేశారు. తణుకు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా కారుమూరి వెంకటనాగేశ్వరరావు నామినేషన్ వేశారు. భీమవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. చింతలపూడి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా కర్రా రాజారావు నామినేషన్ వేశారు. అలాగే ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా ఉండమట్ల ఎలీజా నామినేషన్ వేశారు.